రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మి దంపతులకు కన్నీటి వీడ్కోలు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మి దంపతులకు కన్నీటి వీడ్కోలు
- తల్లి దండ్రులకు తలకొరివి పెట్టిన అన్నదమ్ముళ్లు, అన్న మనోహర్ రెడ్డి, తమ్ముడు రాజశేఖర్ రెడ్డి
- కంటతడి పెట్టిన గ్రామ ప్రజలు, బందు మిత్రులు
- కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ హోం మంత్రి పట్లోళ్ళ సబితా ఇంద్రారెడ్డి
- చేవెళ్ల మాజీ శాసనసభ్యులు కేఎస్ రత్నం
- శంకర్ పల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కే ఉదయ మోహన్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనార్ధన్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: చేవెళ్ల బీజాపూర్ జాతీయ రహదారి లో ప్రయాణిస్తూ, మిర్జాగూడ గేటు వద్ద కారు ప్రమాదంలో మృతి చెందిన ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మేకల లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మీ దంపతులకు పొద్దుటూరు గ్రామ ప్రజలు బంధుమిత్రులు సోమవారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఉద్యోగం చేస్తూ అబ్రాడ్ లో ఉన్న పెద్ద కుమారుడు మనోహర్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం తన తల్లిదండ్రుల మరణ వార్తను తెలుసుకొని ,ఆదివారం సాయంత్రం లండన్ నుంచి బయలుదేరి సోమవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు తన స్వగ్రామమైన పొద్దుటూరుకు చేరుకుని, విగత జీవులుగా పడి ఉన్న తన తల్లిదండ్రులను చూసి తన తమ్ముడైన రాజశేఖర్ రెడ్డిని గుండెలకు హత్తుకొని రోధిస్తుండగా వారిని చూసిన బందు మిత్రులు సైతం శోక సంద్రం లో మునిగిపోయారు. ఆ సమయంలో ఒకేసారి తమ తల్లిదండ్రులను కోల్పోయిన ఆ అన్నదమ్ములను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. కొద్దిసేపటికి తేరుకున్న అన్న, మనోహర్ రెడ్డి తన దుఃఖాన్ని అదిమిపట్టుకుంటూ, తమ్ముడైన రాజశేఖర్ రెడ్డిని ఓదార్చాడు.
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి

గ్రామానికి చెందిన దంపతుల మరణ వార్తను తెలుసుకున్న మాజీ హోం శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఉదయం పదకొండు గంటలకు పొద్దుటూరు గ్రామానికి చేరుకుని లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మి దంపతులకు ఘన నివాళులు అర్పించి. వారి కుమారులైన మనోహర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి లను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియా తో మాట్లాడుతూ.. ఈ యొక్క రోడ్డు ప్రమాదం లో భార్య భర్తలు చనిపోవడం చాలా బాధాకరం ఇప్పటికే చాలా మంది ప్రయాణికులు ఈ రోడ్డు వలన ప్రాణాలు పోగొట్టుకున్న అనేక సందర్భాలను గుర్తు చేస్తూ గత ప్రభుత్వ హాయాం లోనే ఆ రోడ్డు ను నేషనల్ హైవేగా మార్చి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేశామన్నారు. ఈ సమయం లో వారి ఇద్దరి కుమారుల యొక్క తల్లిదండ్రులు లేని లోటు ను ఎవరము పూడ్చ లేమని, భగవంతుడు వారి ఆత్మ కు శాంతి చేకూర్చాలని, ఇద్దరబ్బాయిలకి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ రోడ్డు పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
ఘన నివాళులు అర్పించిన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం

చేవెళ్ల నియోజకవర్గం లోని ప్రజలకు ఎక్కడ ఎలాంటి సమస్యలు వచ్చిన ముందుండే చేవెళ్ల మాజీ ఎంఎల్ఎ కెఎస్ రత్నం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మి దంపతులకు ఘన నివాళులు అర్పించి, వారి కుమారులైన మనోహర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి లను పరమార్శించి ఓదార్చాడు.
పొద్దుటూరు గ్రామ మాజీ ఎంపిటిసి, శంకర్ పల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కే ఉదయ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి లు పూల మాలలతో ఘన నివాళులు అర్పించి వారి కుమారులైన మనోహర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి లను పరామర్శించి ఓదార్చారు.
భారీ ఎత్తున తరలి వచ్చిన గ్రామ ప్రజలు బంధుమిత్రుల మధ్యన సాగిన అంతిమయాత్ర లో వారి కుమారులిద్దరు ముందునడవగా గోవిందా… గోవిందా.. నామస్మరణతో అంతిమ యాత్ర కొనసాగింది. చిన్న కుమారుడు రాజశేఖర్ రెడ్డి తన తల్లికి తలకొరివి పెట్టగా పెద్దకుమారుడు మనోహర్ రెడ్డి తన తల్లికి తలకొరివి పెట్టాడు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి , బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, బీడీఎల్ కంపెనీ మిత్రులు, బంధుమిత్రులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మనోహర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిలను ఓదార్చుతూ
