29న దీక్షా దివస్ విజయవంతం చేద్దాం

29న దీక్షా దివస్ విజయవంతం చేద్దాం
- నవంబర్29 దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం
- పరాయి పాలనలో ఏండ్ల నుంచి గోసపడ్డ తెలంగాణకు స్వరాష్ట్రాన్ని సాధించి స్వాతంత్య్రాన్ని తెచ్చి పెట్టింది కేసీఆర్ దీక్ష .
- తెలంగాణ కబద్ద హస్తాల నుంచి తెలంగాణను కాపాడుకుందాం
- 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంపై చెరిగిపోని సంతకం కెసిఆర్.
- బిఆర్ఎస్ నాయకులు మొహమ్మద్ ఆసిఫ్
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రూరల్, ప్రతినిధి, నవంబర్ 28:
ఈ నెల 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు తరలి రావాలని ఉరెళ్ళ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మొహమ్మద్ ఆసిఫ్. నవంబర్ 29, 2009 న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజని మన అందరికీ తెలుసు అని మహమ్మద్ ఆసిఫ్ తెలిపారు.మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా ఎంతో ఘనమైనది. నాడు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్‌కు తరలించడంతో.. నిమ్స్ కదన రంగంగా మారిపోయిన పరిస్థితి. మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి. కాబట్టి నవంబర్ 29న నిమ్స్ హాస్పిటల్‌లో అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తాము తెలిపారు.దీక్షా దివస్‌తో పాటు తెలంగాణ తల్లి విగ్రహా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గులాబీ కుటుంబ సభ్యులకు పిలుపునిస్తున్న కేటీఆర్ గారితో మేము సిద్ధం. ఆనాటి కార్యక్రమాలు, ఉద్యమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చే విధంగా మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ దుర్మార్గ కాంగ్రెస్, బీజేపీలకు బుద్ది చెప్పాలనే సంకల్పంతోనే ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని స్పష్టం చేశారు.