దేవులపల్లి రమేశ్ కు జాతీయ సాహిత్య పురస్కారం

దేవులపల్లి రమేశ్ కు జాతీయ సాహిత్య పురస్కారం


సిద్దిపేట, నంగునూర్, నవంబర్ 04 :

హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరిగపూడి పూర్ణ చంద్రరావు ఫౌండేషన్, ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి లయన్,ఏ కృష్ణ కుమారి,స్మారక జాతీయ పురస్కారాలు అందజేశారు.సాహిత్య సేవలు అందించినందుకు గాను నంగునూర్ కు చెందిన దేవులపల్లి రమేశ్, ఎంజేపీ గురుకుల పాఠశాల,తెలుగు అతిధి ఉపాధ్యాయుడికి సాహిత్య సేవ పురస్కారం వరించింది. ఈ మేరకు ముఖ్య అతిధులు,హై కోర్టు విశ్రాంత న్యాయమూర్తి,జస్టిస్ రజిని, జస్టిస్ చంద్రకుమార్,నిర్మాత కంఠంనేని రవి శంకర్,డా. బిక్కి కృష్ణ,డా విజయ్ కుమార్, చేతులు మీదుగా పురస్కారం అందుకున్నారు.అనంతరం రమేశ్, మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో సాహిత్య పురస్కారం రావడం సంతోషంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రచయిత్రి డా.రాధ కుసుమ,డా. జెల్ది విద్యాధర్,నాళేశ్వరం శంకరం,రామ కోటేశ్వరరావు, రవీంద్ర బాబు, ప్రముఖ టీవి యాంకర్ లు పత్రిక ఎడిటర్ లు జర్నలిస్ట్ లు కవులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »