విద్యార్థులు యువత డ్రగ్స్ కు బానిసలు కావొద్దు

విద్యార్థులు యువత డ్రగ్స్ కు బానిసలు కావొద్దు

జ్ఞానతెలంగాణ, సంగారెడ్డి :

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పర్యవేక్షణలో “తెలంగాణ సాంస్కృతిక సారథి” సంగారెడ్డి జిల్లా కళాబృందం జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో కళా ప్రదర్శన నిర్వహించారు.విద్యార్థులు, యువకులు డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దని వివరించారు. యువత వ్యసనాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని గేయాలు ఆలపించారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సమాజంలో వస్తున్న వింత పోకడల వల్ల నేడు మానవ విలువలు వెతుక్కోవలసిన గడ్డు పరిస్థితిలు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెడు స్నేహానికి దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలు శారీరకంగా మానసికంగా కృంగదీసి ప్రాణాల మీదకు తెస్తాయని తెలిపారు. భవిష్యత్తులో రాణించలేక మరింత వ్యసనానికి బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు.

తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లల వ్యవహార శైలిలో మార్పులు గమనించినట్లయితే నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. కళాకారుల పాటలు గ్రామస్తుల్ని ఆలోచింపచేసాయి.ఈ కార్యక్రమంలో కళాకారులు ఎ.సునీల్ కుమార్, డి.రమేష్, ఎన్.దుర్గేష్, ఇ.వినేష్, బి.నవీన్, జి.శంకర్, పి.సంద్య, పాల్గొని కళా ప్రదర్శన నిర్వహించారు.

You may also like...

Translate »