పొద్దటూర్ లో సీసి రోడ్ల నిర్మాణం చేపట్టిన శంకర్ పల్లి మాజీ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి

పొద్దటూర్ లో సీసి రోడ్ల నిర్మాణం చేపట్టిన శంకర్ పల్లి మాజీ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి


  • పొద్దటూర్ మాజీ ఎంపిటిసి శంకర్ పల్లి మండల మాజీ ఎంపిపి ఆధ్వర్యంలో
  • ప్రారంభమైన సిసి రోడ్ల నిర్మాణం
  • ఎంపిటిసి నిధులతో గ్రామ అభివృద్ది పనులు
  • హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం, పొద్దటూర్ గ్రామం లో గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న సిసి రోడ్డు పనులను, శంకర్ పల్లి మండల మాజీ వైస్ ఎంపిపి బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి ఆధ్యర్యంలో పొద్దటూర్ మాజీ వార్డు మెంబర్ కవేలి రాంరెడ్డి సోమవారం నాడు లాంఛనంగా ప్రారంభించాడు. గ్రామం లోని హనుమాన్ టెంపుల్ సమీప బస్తీలలో లోని, నాలుగు వీధులలో వివిధ కారణాల చేత పెండింగ్ లో ఉన్న సిసి రోడ్లను ఎంపిటిసి నిధులతో, పొద్దటూర్ గ్రామ మాజీ ఎంపిటిసి బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పొద్దటూర్ మాజీ వార్డు మెంబర్ కవేలి రామ్ రెడ్డి సిసి రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజల సౌకర్యార్థం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికైన నేను ముందుంటానని, ఇది వరకు గ్రామం లో వివిధ బస్తీలలో సిసి రోడ్లు నిర్మించడం జరిగిందని అన్నారు. మన గ్రామ మాజీ ఎంపిటిసి, మన శంకర్ పల్లి మండల మాజీ ఎంపిపి బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి గారు మన గ్రామ ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ముచేయకుండా గ్రామాభివృద్ది లో తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తూ మన గ్రామానికి నిధులు తీసుకురావడం లో సఫలీకృతమయ్యారని మన గ్రామానికి బొల్లారం వెంకట్ రెడ్డి చేస్తున్న సేవలు మరువలేనివి కొనియాడారు. ఈ సందర్భంగా బొల్లారం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గతం లో కూడా, ప్రభుత్వం నుండి మన గ్రామానికి రావాల్సిన వృద్ధాప్య ఫించన్ వంటి వివిధ రకాల ప్రభుత్వ పథకాలు మన గ్రామానికి గణనీయంగా తీసుకురావడం జరిగిందని, గ్రామానికి ఎలాంటి నిధులు అవసరమున్న అధికారులను ఒప్పించి, మెప్పించి తీసుకొచ్చే బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తూ,నిర్విరామంగా కృషి చేయడం జరిగిందన్నారు.గ్రామంలో కొన్ని చోట్ల సిసి రోడ్ల నిర్మాణ పనులు పెండింగ్ లో ఉన్నాయి.వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని అన్నారు.

బొల్లారం వెంకట్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల గ్రామ ప్రజలు యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో సిసి రోడ్ల నిర్మాణ పనులు తన భుజాన వేసుకుని వేగవంతం చేసిన పొద్దటూర్ మాజీ వార్డు సభ్యులు కవేలి రామ్ రెడ్డిని గ్రామ ప్రజలు అభినందిస్తూ.., వార్డు మెంబర్ గా కవేలి రాంరెడ్డి నూరు శాతం తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడని అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమం లో పొద్దటూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఏనుగు నర్సింహ రెడ్డి, పొద్దటూర్ గ్రామ మాజీ ఎంపిటిసి శంకర్ పల్లి మాజీ ఎంపిపి బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గండిచర్ల గోవర్ధన్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ సురకంటి మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ కె శ్రీనివాస్, మాజీ డిప్యూటీ సర్పంచ్ బండ నర్సింహా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు బొల్లారం మోహన్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు కవేలి జంగారెడ్డి, మాజీ వార్డు సభ్యులు కవేలి రాంరెడ్డి, మాజీ వార్డు సభ్యులు చాకలి రాములు, మాజీ వార్డు సభ్యులు అజేందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు కవేలి గోవర్ధన్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు దర్ని కృష్ణ, గ్రామ బిల్ కలెక్టర్ ల్యాగల మల్లేష్,పెద్దలు పట్నం రాజి రెడ్డి, ఎనికేపల్లి రాంచందర్, నాని బుచ్చయ్య, బొల్లారం జంగా రెడ్డి,మేకల రఘుపతి రెడ్డి, ఏనుగు సంజీవ రెడ్డి, పులకండ్ల గోపాల్ రెడ్డి, క్రాంతి యూత్ వైస్ ప్రసిడెంట్ నాని మల్లేశం, గ్రామ యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »