పొద్దుటూరు లో ఘనంగా దేవి శరన్నవరాత్రులు

పొద్దుటూరు లో ఘనంగా దేవి శరన్నవరాత్రులు


రెండు లక్షల 95 వేలకు అమ్మ వారి కలశం దక్కించుకున్న పులకండ్ల ముత్యంరెడ్డి
– ఒక్క లక్ష 75 వేలకు అమ్మవారి మహా ప్రసాదమైన, లడ్డూను దక్కించుకున్న మేకల బల్వంత్ రెడ్డి
– భక్తి శ్రద్ధలతో పాల్గొన్న గ్రామ ప్రజలు


జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: విజయదశమి రోజున రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టు పై ఉంచిన తమ ఆయుధాలు తిరిగి తీసిన రోజు, శక్తి స్వరూపిణి జగన్మాత దుర్గాదేవి సర్వ దేవతల ఆయుధములను సమకూర్చుకొని మహిషాసురుడిని అతని సైన్యమును హతమార్చిన సందర్భంగా హిందువులందరూ ఘనంగా జరుపుకునే దసరా పండుగను పొద్దుటూరు గ్రామంలోని దుర్గామాత కమిటీ సభ్యులు దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులు నిష్ఠతో అమ్మవారికి పూజలు చేసి, వేద బ్రాహ్మనోత్తముల చేత భక్తిశ్రద్ధలతో శక్తి పీఠాన్ని కదిలించి శనివారం నాడు దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, దుర్గామాత చేతిలోని లడ్డూను ఒక్క లక్ష డెబ్భై ఐదు వేల రూపాయలకు మేకల బలవంత్ రెడ్డి దక్కించుకోగా, తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో అమ్మవారి పూజలో ఉంచినటువంటి కలశం ను రెండు లక్షల 95 వేలకు పులకండ్ల ముత్యం రెడ్డి కైవసం చేసుకున్నారు. అనంతరం గ్రామంలోని మహిళలు యువకులు మరియు గ్రామ ప్రజలందరూ తరలిరాగ దుర్గామాత దేవి ఊరేగింపును గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భక్తిశ్రద్ధలతో ఊరేగించారు మహిళల కోలాటాల నృత్యాలు కనుల పండుగ చేయగా పొద్దుటూరు గ్రామంలో, పండుగ వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి, మాజీ రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి. మాజీ సర్పంచ్ కె శ్రీనివాస్, పొద్దుటూరు గ్రామ మాజీ ఉపసర్పంచ్ బండ నరసింహ, మాజీ కో ఆప్షన్ సభ్యులు కవేలి జంగారెడ్డి, కొండకల్ల విష్ణువర్ధన్, పుల కండ్ల రఘుపతి రెడ్డి,మాజీ వార్డు సభ్యులు కవేలి రాంరెడ్డి, మాజీ వార్డు సభ్యులు అజేందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు చాకలి రాములు, పులకండ్ల గోపాల్ రెడ్డి, మాజీ గ్రామ పంచాయతీ సభ్యులు దర్ని కృష్ణ, మేకల బల్వంత్ రెడ్డి, కవేలి తిరుపతి రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఏనుగు సంజీవరెడ్డి, ల్యాగల హన్మంతు, బొల్లారం జంగారెడ్డి, ఎం రవీందర్, ఏనుగు గోవర్ధన్ రెడ్డి, మేకల రఘుపతి రెడ్డి,పొద్దుటూరు గ్రామ బిల్ కలెక్టర్ ల్యాగల మల్లేష్, గ్రామ మహిళలు యువకులు, మరియు గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.

You may also like...

Translate »