దిక్కుమాలిన ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు ఐదు నెలలుగా జీతాలు లేవు.

దిక్కుమాలిన ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు ఐదు నెలలుగా జీతాలు లేవు.

  • దండగమారి పాలనలో…పండుగ పూట కూడా పస్తులు..! రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ ఫైర్.
  • ప్ర‌భుత్వ‌, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప‌ట్ల నిర్ల‌క్ష్య ధోర‌ణి
  • ఒక‌టో తేదీన జీతాలు ఇస్తున్నామ‌ని గొప్ప‌లు
  • పంచాయతీ వర్కర్స్, మున్సిపాలిటీ కార్మికులు, ఆసుపత్రి సిబ్బంది, హాస్టల్ వర్కర్స్, గెస్ట్ లెక్చరర్స్ కి జీతాలు ఇవ్వండి
  • ప్రతీ శాఖలో వేతనాల్లేక చిరుద్యోగులు విలవిల‌లాడిపోతున్నార‌ని
  • ఆవేదనతో ట్వీట్ చేసిన కేటీఆర్

ప్ర‌భుత్వ‌, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప‌ట్ల నిర్ల‌క్ష్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఒక‌టో తేదీన జీతాలు ఇస్తున్నామ‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్న రేవంత్ స‌ర్కార్‌కు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది క‌నిపించ‌డం లేదా..? అని కేటీఆర్ నిల‌దీశారు. ఈ మేర‌కు కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.దండ‌గ‌మారి పాల‌న‌లో పండుగ పూట కూడా ప‌స్తులు ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఐదారు నెలలుగా జీతాల్లేవ్ అని తెలిపారు. పంచాయతీ వర్కర్స్, మున్సిపాలిటీ కార్మికులు, ఆసుపత్రి సిబ్బంది, హాస్టల్ వర్కర్స్, గెస్ట్ లెక్చరర్స్.. ఇలా ప్రతీ శాఖలో వేతనాల్లేక చిరుద్యోగులు విలవిల‌లాడిపోతున్నార‌ని కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.చిరుద్యోగులు కుటుంబాలను నెట్టుకురావడానికి అప్పులు చేసి నానా తిప్పలు పడుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామని పలికిన ప్రగల్భాలు ఎటుబాయె..? దసరా దగ్గరికి వచ్చింది..సరుకులు కొనడానికి చేతిలో నయాపైసా లేదు..! నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో డితే బతుకు బండి నడిచేదెట్లా..? 10 నెలల్లో తెచ్చిన రూ. 80 వేల కోట్లు అప్పులు ఎక్కడికి పోయినయ్..? చిరుద్యోగులు.. చిన్నజీతాల కార్మికుల అవస్థలను పట్టించుకోండి..వెంటనే వేతనాలు చెల్లించండి అని రేవంత్ స‌ర్కార్‌ను కేటీఆర్ డిమాండ్ చేశారు.

You may also like...

Translate »