జవహర్ నవోదయ విద్యాలయం లో ప్రవేశానికి గడువు పొడిగింపు

జవహర్ నవోదయ విద్యాలయం లో ప్రవేశానికి గడువు పొడిగింపు
- ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు
- ఈ నెల 23వ తేదీ వరకు గడువు పొడిగింపు
నాగార్జునసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయం(జేఎన్ వీ)లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ ఆర్. నాగభూషణం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న విద్యా ర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. విద్యార్థులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే చదువుతూ, తల్లిదండ్రులు సైతం ఇదే జిల్లాలో నివాసం ఉండాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు హెచ్ టీ టీపీఎస్://నవోద య.జీఓవీ.ఇన్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసు కోవాలన్నారు. విద్యార్థి ప్రస్తుతం చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రం, ఫొటోను దరఖాస్తునకు జతచేయాలని సూచించారు.
