జేఎన్ టీయూలో ప్రాంగణ నియామకాలు

Image Source /Forage
జేఎన్ టీయూలో ప్రాంగణ నియామకాలు
- 17 మంది విద్యార్థులు వివిధ కంపెనిల్లో ఎంపిక
- ఏడాదికి రూ.17 లక్షల ప్యాకేజీతో ఎంపిక
- సీఎస్ఈ విద్యార్థుల ఎంపికే ఎక్కువ
పలువురి నుండి యూనివర్సిటీ విద్యార్థులకు అభినందనల వెల్లువ జేఎన్ టీయూలో(జవహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ) తాజాగా 17 మంది విద్యార్థులు వివిధ కంపె నీల్లో ప్రాంగణ నియామకాలు సాధించారు. వెరిస్క్ కంపెనీ వారు సీఎస్ఈకి చెందిన అబ్దుల్ మతీన్, నందిని మహరాజ్ ను ఏడాదికి రూ.17 లక్షల ప్యాకేజీతో ఎంపిక చేసుకున్నారు. హనీవెల్ కంపెనీ వారు 15మంది సీఎస్ఈ, ఈసీఈ విద్యార్థులను ఒక్కొక్కరికి ఏడాదికి రూ.9 లక్షల ప్యాకేజీతో ఎంపిక చేశారు. వీరిని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.వి. నరసింహారెడ్డి, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ విష్ణువర్ధన్ అభినందించారు.