పోటీ లేకుండా చేరొకటి పంచుకుందాం!

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా కంపెనీలకు రూ.4,350 కోట్ల నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ టెండర్లు

అంచనా వ్యయం కంటే 3.95 శాతం అధికంగా రూ.4,350 కోట్ల పనులు రెండు కంపెనీలకు అప్పగింత పై అనుమానాలు.

ప్రైస్ బిడ్డింగ్లో ఉన్నవి రెండే కంపెనీలు.. పోటీ లేకుండా ఉండేలా మొదటి ప్యాకేజ్ నీకు, రెండో ప్యాకేజ్ నాకు అన్నట్లు పంచుకున్న రాఘవ కన్స్ట్రక్షన్, మేఘా ఇంజనీరింగ్.

మొదటి ప్యాకేజ్ 1 కింద రూ.1,134.62 కోట్ల పనులకు టెండర్ పిలవగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ 3.9 శాతం అధికంగా కోట్ చేయగా, మేఘా ఇంజనీరింగ్ 4.85 శాతం అధికంగా కోట్ చేయగా ఎల్ 1గా నిలిచిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్ దక్కింది.

మొదటి ప్యాకేజ్ 2 కింద రూ.1,126.85 కోట్ల పనులకు టెండర్ పిలవగా మేఘా ఇంజనీరింగ్ 3.95 శాతం అధికంగా కోట్ చేయగా, రాఘవ కన్స్ట్రక్షన్ 4.8 శాతం అధికంగా కోట్ చేయగా ఎల్ 1గా నిలిచిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి టెండర్ దక్కింది

You may also like...

Translate »