గురుకుల కాలేజీలో బీఏ యానిమేషన్‌ కోర్సు

గురుకుల కాలేజీలో బీఏ యానిమేషన్‌ కోర్సు

  • దరఖాస్తు గడువు పొడిగింపు :ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు

డిమాండ్‌లో ఉన్న బీఏ యానిమేషన్‌ కోర్సు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో అందుబాటులో ఉందనీ, దీనిలో చేరడానికి ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి బడుగు సైదులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ఈ కోర్సులో ప్రవేశం పొందడానికి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులనీ, ఆసక్తి కలిగిన విద్యార్థులు వెబ్‌ సైట్‌ https://mjptbcwreis.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9032644463, 9063242329 సంప్రదించాలని ఆయన సూచించారు.

You may also like...

Translate »