వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ లో పుస్తకాల దందా

జీవో నెంబర్ 1కి విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్న వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్

అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులపై దురుసుగా వ్యవహరించిన యాజమాన్యం

యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్న ఎంఈఓ ను సస్పెండ్ చేయాలి

లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో చేవెళ్ల నిర్వహిస్తాం

జ్ఞాన తెలంగాణ చేవెళ్ల

ఈరోజు చేవెళ్ల మండల పరిధిలోని వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని సమాచారంతో ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ జీవో నెంబర్ ఒకటికి విరుద్ధంగా వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో బుక్స్లు అమ్ముతున్నారని అన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు బుక్స్ తో పాఠశాల ముందు ధర్నా నిర్వహిస్తుంటే పాఠశాల యాజమాన్యం దురుసుగా వ్యవహరించడంతోపాటు మీరు ఎవరికీ కంప్లీట్ చేసినా మేము బుక్స్ విక్రయిస్తామని కరాకండిగా యాజమాన్యం చెప్తున్నారు అలాగే స్థానిక ఎంఈఓ అక్బర్ గారికి చరవాణిలో సమాచారం ఇస్తే తాను మూడు గంటలకు వస్తానని పాఠశాల యాజమాన్యం ఎస్ఎఫ్ఐ నాయకులు ఎంఈఓ మనం మాట్లాడదామని చెప్పడం విడ్డూరంగా ఉందని దీనినిబట్టి ఎంఈఓ అక్బర్ గారు ప్రైవేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతూ విద్యా వ్యాపారానికి కృషి చేస్తున్నారని అన్నారు స్థానిక ఎంఈఓ అక్బర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని బుక్స్ విక్రయిస్తున్న వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని అన్నారు జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో చేవెళ్ల నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »