విజయవంతంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

విజయవంతంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం
జ్ఞాన తెలంగాణ జూన్ 14, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెంపుల మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు పద్మ ఆద్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఏపిసి చైర్మన్ పప్పుల విజయ మాట్లాడుతూ..విద్యార్థులకు చిన్నప్పటినుండే చదువు పట్ల ఆసక్తి పెంపొందించాలని,ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయినిలు అంజలి,శ్రీలత,షాహిన్,సహయకారులు చిర్ర.రాజ్యం,రాధమ్మ మరియు విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.