Electricity Bill: రీడింగ్‌ ఆలస్యమైతే ఇలా లెక్కిస్తారు: సీఎండీ

కరెంటు బిల్లుల జారీలో ఆలస్యంతో శ్లాబు మారిపోతుందనే ప్రచారంలో నిజం లేదని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జి.రఘుమారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.