బెంగళూరులో భారీ వర్షం.. ఆర్సీబీ, కోల్‌కతా మ్యాచ్ టాస్ ఆలస్యం..!

ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణలో తొలి మ్యాచ్‌కోసం చిన్నస్వామి స్టేడియా నికి పోటెత్తిన అభిమానులకు షాకింగ్ న్యూస్. వాతావరణ శాఖ హెచ్చరించినట్టే.. మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగిస్తున్నాడు. టాస్ సమయానికి ముందే బెంగళూరులో వర్షం మొదలైంది. అది కాస్త భారీ వానగా మారింది. దాంతో, 7 గంటలకు వేయాల్సిన టాస్‌ను వాయిదా వేశారు. చినుకులు తగ్గిన తర్వాత.. సిబ్బంది ఔట్ ఫీల్డ్‌ను సిద్ధం చేశాక మ్యాచ్ మొదలయ్యే అవకాశముంది.
గత రెండు రోజులుగా బెంగళూరులో వాతావరణం మేఘావృతమై ఉంటోంది. మ్యాచ్ రోజైన శనివారం కూడా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెప్పింది. అయితే.. పదిరోజుల బ్రేక్ తర్వాత మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. కానీ, తీరా టాస్ వేయడానికి ముందే వర్షం అందుకుంది. ఒకవేళ మ్యాచ్ సాధ్యం కాకుంటే ప్లే ఆఫ్స్ రేసుకు ఒక్క విజయం దూరంలో ఉన్న ఆర్సీబీకి నిరాశ తప్పదు
ఈ ఎడిషన్‌లో అదరగొడుతున్న బెంగళూరు జట్టు ప్రస్తుతం 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఒకవేళ శనివారం కోల్‌కతాతో మ్యాచ్ రద్దయితే.. ఇరుజట్లకు ఒక్కో పాయింట్ వస్తుంది. అప్పుడు ఆర్సీబీ 17 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులోనే ఉంటుంది. అయితే.. మే 23న సన్‌రైజర్స్ హైదరాబాద్, మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌పై కచ్చితంగా గెలిచి తీరాలి. వీటిలో ఒక్కటి ఓడినా 19 పాయింట్లతో రేసులో నిలుస్తుంది. కానీ, పంజాబ్, ఢిల్లీ, ముంబై.. ఫలితాలపై ఆర్సీబీ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
