తెలంగాణ గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల..

తెలంగాణ గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల

ఙ్ఞాన తెలంగాణ, వెబ్ డెస్క్:
హైదరాబాద్‌: రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన ధ్రువపత్రాల పరిశీలనకు టీజీపీఎస్సీ తేదీని ఖరారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్‌ ర్యాంకుల జాబితాను ప్రకటించిన టీజీపీఎస్సీ.. తాజాగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన మెరిట్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈనెల 13 నుంచి వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకునేందుకు కమిషన్‌ అవకాశం కల్పించింది. ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవాలని సూచించింది. వారిని మాత్రమే విడతల వారీగా ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని పేర్కొంది. అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపింది.
పరిశీలన కోసం అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు కమిషన్‌ సూచించింది. కులధ్రువీకరణ, బీసీ నాన్‌ క్రీమీలేయర్, దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు, ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ/నివాస ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 2021-22 ఏడాదికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రంతోపాటు అవసరమైన పత్రాలన్నీ దగ్గర ఉంచుకోవాలని తెలిపింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలో తప్పనిసరిగా ఈ పత్రాలన్నీ సమర్పించాల్సి ఉంటుందని.. అభ్యర్థులకు అదనపు గడువు ఇవ్వబోమని ఇప్పటికే టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

జాబితా కోసం క్లిక్‌ చేయండి

https://www.tspsc.gov.in/uploadPDF/GROUP-IV-CV-PREAMBLE-FINAL.pdf

You may also like...

Translate »