ఈ నెల 24న తెలంగాణ ఇంటర్, 30న పదో తరగతి పరీక్షా ఫలితాలు !

తెలంగాణాలో పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్‌ కార్యాలయంలో విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18 నుంచి ఏప్రిల్‌ రెండో తేదీ వరకు జరిగాయి. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్‌ విద్యామండలి కార్యాలయంలో బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇంటర్‌ ఫలితాలను విద్యార్థులు https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్ల నుంచి పొందవచ్చు.

You may also like...

Translate »