చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలి

చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలి

  • సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్

జ్ఞాన తెలంగాణ/ఖమ్మం రూరల్ : ప్రజల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పొన్నెకంటి పెద్ద వెంకన్న జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు పొన్నెకంటి చక్రవర్తి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తొలుత దీనిని దండి సురేష్, సిపిఐ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిప్పులు కొలమిని తలపిస్తున్న వేసవిలో భూగర్భ జలాలు ఇంకిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో బావులు, బోర్లు,చెరువులు ఎండిపోవడంతో నీళ్ల కోసం ఇక్కట్లు మొదలయ్యాయి అన్నారు. కావున గ్రామాల్లో, రహదారుల వెంట చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా దాహర్తిని తీర్చవచ్చు అన్నారు. అనంతరం చలివేంద్రం ఏర్పాటు చేసిన చక్రవర్తిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మిడకంటి చిన్న వెంకటరెడ్డి, జిల్లా సమితి సభ్యులు చెరుకుపల్లి భాస్కర్, వరంగల్ క్రాస్ రోడ్ గ్రామ శాఖ కార్యదర్శి వెంపటి సురేందర్, సిపిఐ నాయకులు ఏర్పుల బ్రహ్మం, మేళ్లచెరువు గురవయ్య , ఆరంపుల సతీష్, టేకుమట్ల శ్రీను, ఉపేందర్ ,యువజన సంఘం నాయకులు మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, దండి రమేష్ ,గణపరపు ఉపేందర్, మేళ్లచెరువు సాయి, శ్రీకాంత్ , వెంకన్న, వల్లెబోయిన వినోద్, పొన్నెకంటి అఖిల్, మామిడాల కిరణ్, ఎల్లయ్య, మహేష్, గరిక బాబు తదితరులు పాల్గొన్నా

You may also like...

Translate »