గత యేడాది లడ్డు దక్కించుకున్న మా కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూశాడు

గత యేడాది లడ్డు దక్కించుకున్న మా కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూశాడు
- పొద్దటూర్ లో గణేష్ లడ్డు దక్కించుకున్న మందుమూల లక్ష్మణ్ కళ్ళలో వెళ్లి విరిసిన ఆనందం…,
- ఉప్పొంగిన ఆనందం తో రెండులక్షల యాభైతొమ్మిది వేల రూపాయల నగదు అందజేసిన మందుమూల లక్ష్మణ్…
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా, పొద్దటూర్ గ్రామం, శంకర్ పల్లి మండలానికి చెందిన మందూమూల లక్ష్మణ్ గత ఏడాది వినాయక చవితి సదర్భంగా పొద్దటూరు గ్రామం లో క్రాంతి యూత్ క్లబ్ ప్రక్కన నిలబెట్టిన విఘ్నేశ్వరుని చేతిలోని రెండు లడ్డూలను రెండు లక్షల యబైతొమ్మిది వేలకు కైవసం చేసుకొని తన భక్తిని చాటుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆయొక్క నగదు రూపాయలను గురువారం వినాయక కమిటీ సభ్యులకు పలువురు గ్రామ పెద్దల సమక్షంలో లో అందజేశారు. ఈ సందర్భంగా మందుమూల లక్ష్మణ్ మాట్లాడుతూ.., గత సంవత్సరం నేను ఈ యొక్క గణేశుని చేతిలోని లడ్డూను కొనడం వలన మా కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుడు ఎంతో మేలు చేశాడని గత సంవత్సర కాలంగా మా కుటుంబ సభ్యులందరము చాలా సంతోషంగా ఎలాంటి లోటు పాట్లు లేకుండా జీవించామని, సంతోషం వ్యక్తం చేశారు. ఆయొక్క గణేశుని లడ్డు మాకు లభించడం మా కుటుంబం చేసుకున్న అదృష్టం గా భావిస్తున్నామని ఈ సంవత్సరం కూడా.., గణేశుని కృపతో, గణేష్ చేతిలోని లడ్డూను చేజిక్కించుకుంటామని అందుకొరకు ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబం పై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు పులకండ్ల రఘుపతి రెడ్డి, నాని బుచ్చయ్య, మాజీ వార్డు మెంబర్ నాని రత్నం, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు బూడుదుల నరేందర్, మందుమూల శ్రీకాంత్, కార్తీక్, నక్క సందీప్, సాయి,డప్పు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
