“జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్‌కు బయలుదేరిన ప్రొద్దుటూరు యువ క్రీడాకారులు”

- ప్రయాణానికి సహకరించిన ప్రొద్దుటూరు మాజీ వార్డు మెంబర్ నాని రత్నం”
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:
రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ బాలురు, బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్లో జరుగుతున్నాయి. ఈ ఎంపికల్లో విజయాన్ని సాధించిన ఆటగాళ్లు సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముప్కల్ గ్రామంలో జరగనున్న 35వ సబ్ జూనియర్ అంతర్జిల్లా కబడ్డీ పోటీల్లో రంగారెడ్డి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ ఎంపికల్లో పాల్గొనడానికి ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన యువ కబడ్డీ క్రీడాకారులు ఆఫ్రోజ్, బూదుడుల విష్ణు, నక్క హర్షిత్, బేగరి నవీన్, బేగరి శ్రీనాథ్, నాని రంజిత్, నాని జాషువా, నక్క విశ్వతేజ, మందుమూల రాకేష్ హాజరయ్యారు.
గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్ నాని రత్నం తమ స్వంత ఖర్చులతో ఈ క్రీడాకారుల కోసం తవేరా వాహనాన్ని ఏర్పాటు చేసి, వారిని సెలక్షన్స్ కు పంపించారు. ఈ సందర్భంగా పెద్దలు రంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ మెంబర్ మందుమూల లక్ష్మణ్, కబడ్డీ సీనియర్ క్రీడాకారుడు నాని మల్లేష్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంలో మాజీ వార్డు మెంబర్ నాని రత్నం మాట్లాడుతూ, “ప్రొద్దుటూరు యువత క్రీడల్లో రాణించి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రీడలతో శారీరక దృఢత్వమే కాకుండా, క్రమశిక్షణ, ఐక్యమత్యం పెంపొందితాయని,ఈ అవకాశాన్ని వినియోగించుకుని మన గ్రామానికి గౌరవం తీసుకురావాలని ఆశిస్తున్నానని క్రీడాకారులను ఉద్దేశించి అన్నారు.ఈ కార్యక్రమంలో కబడ్డీ క్రీడాకారులు ఆఫ్రోజ్, బూదుడుల విష్ణు, నక్క హర్షిత్, బేగరి నవీన్, బేగరి శ్రీనాథ్, నాని రంజిత్, నాని జాషువా, నక్క విశ్వతేజ, మందుమూల రాకేష్ పాల్గొన్నారు.