ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారుల కొరడా.

ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారుల కొరడా.
హైదరాబాద్ జనవరి 13: ప్రైవేటు బస్సులపై రవాణ శాఖ అధికారులుఈరోజు దాడులు నిర్వహించారు.సంక్రాంతి పండుగ సందర్భంగా అధికారుల ఆదేశాల మేరకు ఎల్బీ నగర్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు.
నిబంధనలకు విరుద్దంగా రోడ్డలపై తిరుగుతున్న 15బస్సులపై కేసు నమోదు చేశారు.నిబంధనలను పాటించ కుండా ప్రైవేటు టావెల్స్ ఇష్టానుసారంగా వ్యవ హరిస్తున్నాయని కనీసం ఫైర్ సెఫ్టీని కూడా పెట్టుకోవడం లేదని రవాణాశాఖ అధికారి ఆనంద్ శ్యాంప్రసాద్ తెలిపారు.నిబంధనలను పాటించ కపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
