విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల :చేవెళ్ల మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగడపల్లి యందు ఈరోజు స్వయంపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఒకరోజు విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. తాము ఈరోజు ఉపాధ్యాయుల గా విధులు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఈరోజు ఉపాధ్యాయుల సమస్యలు స్వయంగా తెలుసుకోవడం జరిగిందని అలాగే ఈరోజు మాకు జీవితంలో మర్చిపోలేని రోజు అని విద్యార్థులు అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలు బయటికి తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు గోపాల్ గారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని అన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు