కొండకల్ మార్కెట్ యార్డులో మద్యం సేవించిన ఇద్దరు యువకులకు జరిమానా

కొండకల్ మార్కెట్ యార్డులో మద్యం సేవించిన ఇద్దరు యువకులకు జరిమానా


  • గ్రామపంచాయతీ పరిధిలో మద్యం సేవనంపై కఠిన చర్యలు – సెక్రటరీ రియాజ్ హెచ్చరిక

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:కొండకల్ మార్కెట్ యార్డులో ఇద్దరు యువకులు మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సెక్రటరీ రియాజ్, వారికి రూ.1000 జరిమానా విధించారు. గ్రామపంచాయతీ పరిధిలో మద్యం సేవించడం, చెత్త వేయడం వంటి చర్యలపై కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

సెక్రటరీ రియాజ్ మాట్లాడుతూ, “గ్రామ పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత. మద్యం సేవించి ప్రజలను అసౌకర్యానికి గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. అంతేకాకుండా, తదుపరి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే “మరింత గట్టి శిక్షలు విధిస్తాం” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు మద్యం సేవనపై అవగాహన పెంచుకోవాలని, సమాజంలో శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పే దిశగా అందరూ సహకరించాలని కోరారు.

You may also like...

Translate »