పొద్దుటూరులో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి

పొద్దుటూరులో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: అణగారిన వర్గాల గుండెల్లో దివ్వెలు వెలిగించిన మహానుభావుడు, నీతి నిజాయితీ కలిగిన సంస్కరణ హృదయుడు భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు గా పాల్గొని, పొద్దుటూరు గ్రామ మాజీ ఎంపిటిసి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి, పొద్దుటూరు గ్రామ మాజీ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సమక్షంలో గ్రామ పంచాయితీ వద్ద, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు అనితర సాధ్యమైనవని అన్నారు. దేశ స్వతంత్రం అనంతరం ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయం పాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు.ఆర్థిక, సామాజిక, రాజకీయ ,సాంస్కృతిక, తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా న్యాయం దక్కేల రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కనబరిచిన దార్శనికత ఉన్నతమైనదని,దేశంలో రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం చూపిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పొద్దుటూరు గ్రామ మాజీ ఎంపీటీసీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి, పొద్దుటూరు గ్రామ మాజీ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ కే శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచి బండ నరసింహ, మాజీ కో ఆప్షన్ సభ్యులు కవేలి జంగారెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ కవేలి రాంరెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ చాకలి రాములు, పెద్దలు పట్నం మోహన్ రెడ్డి, కే విష్ణువర్ధన్ రెడ్డి, ఎనికేపల్లి మాణిక్యం,అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బూడుదుల మహేందర్, మందు మూల శ్రీనివాస్, ఎంఎస్ఎఫ్ జిల్లా విద్యార్థి విభాగ ప్రెసిడెంట్ నాని భాను ప్రసాద్, ఆసిగళ్ల బాల్ రాజ్, బి గణేష్, నక్క రాజు, డప్పు బిక్షపతి, నాని మహేష్,పి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
–Nani Ratnam,