డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి


జ్ఞాన తెలంగాణ,షాబాద్,డిసెంబర్ 06:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహా మేధావి అని అంటరానితనం,కుల నిర్మూలన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో షాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీలు గుండాల అశోక్, కుమ్మరి చెన్నయ్య, నాయకులు దండు రాహుల్, గంధం గౌరీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »