నేడే పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సర్టిఫికెట్ల పరిశిలన

నేడే పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సర్టిఫికెట్ల పరిశిలన


జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌: గ్రామ పాలన అధికారుల (జీపీవో) పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సర్టిఫికెట్ల పరిశీలనను రెవెన్యూ శాఖ చేపట్టింది. 10,954 రెవెన్యూ గ్రామాలకు జీపీవోలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 16వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండగా.. సర్వీసు అంశంపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో గడువును 26 వరకు పొడిగించాలని ఆదేశించింది. మొత్తం 6,196 దరఖాస్తులు అందినట్లు సమాచారం. వీటిలో అర్హులను గుర్తించేందుకు ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు.

You may also like...

Translate »