నేడే చీఫ్ మినిస్టర్ కప్- 2024

నేడే చీఫ్ మినిస్టర్ కప్- 2024


రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామస్థాయి క్రీడోత్సవాలు

  • కబడ్డీ
  • ఖో ఖో
  • వాలీ బాల్
  • అథ్లెటిక్స్

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చీఫ్ మినిస్టర్ కప్ క్రీడోత్సవాలు డిసెంబర్ 7 మరియు 8 తేదీలలో గ్రామస్థాయిలో నిర్వహించబడతాయి. ఆయా క్రీడ లలో ఆసక్తి ఉన్న, తమ స్వంత గ్రామానికి సంబంధించిన క్రీడాకారులు మాత్రమే, గ్రామ సెక్రెటరీ ,పాఠశాల, పిడి లేదా పిఈటిల సమక్షంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. కబడ్డీ, ఖో ఖో మరియు ఫుట్ బాల్ లకు వయోపరిమితి లేదు. కబడ్డీ పురుషులు 85 కేజి, ఉమెన్ 75 కేజి వరకు అనుమతిస్తారు,వాలీ బాల్ అండర్ – 18 బాల, బాలికలు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది.అన్ని క్రీడలలో స్త్రీ, పురుషులకు సమాన అవకాశం కల్పించారు. ఆయా క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను గుర్తించి మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసి, చివరగా రాష్ట్రస్థాయిలో క్రీడలు నిర్వహించి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు దినోత్సవం ఉంటుంది. పాఠశాల స్థాయి విద్యార్థులకు అండర్ -18 మరియు వివిధ ఏజ్ గ్రూప్ ల ప్రకారం, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్, యోగ మరియు అథ్లెటిక్స్ వంటి క్రీడలు నిర్వహిస్తారు. ఇట్టి క్రీడలు శంకర్ పల్లి మండల ఎంపీడీవో వెంకయ్య గౌడ్ , మునిసిపల్ కమిషనర్ జి శ్రీనివాస్, ఎంఈఓ అక్బరుద్దీన్, ఆయా పాఠశాలల హెడ్మాస్టర్స్, గ్రామాల సెక్రటరీలు, పిడి మరియు పీఈటి ల సమక్షంలో నిర్వహించబడతాయని శంకర్ పల్లి సీఎం కప్ ఇన్చార్జి, ఎస్ఎ పిడి అరుంధతి ఓ ప్రకటనలో తెలియజేశారు

– -నాని రత్నం,బి.కాం శంకరపల్లి మండల రిపోర్టర్

You may also like...

Translate »