చేవెళ్ల లో తిమ్మారెడ్డిగూడెం వ్యక్తి ఆత్మహత్య

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి(నవీన్):
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన సంజీవ అనే వ్యక్తి మంగళవారం పూడూరు చౌరస్తాలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
