మూలుగ బొక్క పడలేదని పెళ్లి రద్దు

మూలుగ బొక్క పడలేదని పెళ్లి రద్దు
నిజామాబాద్ డిసెంబర్ 24 పెళ్ళికొడుకు బంధువులకు మూలుగ బొక్క వేయలేదని వివాహం రద్దు చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతి, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించడానికి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కట్న కానుకలు అన్ని మాట్లాడుకున్నారు.
నిశ్చితా ర్థం సందర్భంగా యువతి ఇంట్లో మాంసహారంతో భోజనం ఏర్పాటు చేశారు.అబ్బాయి బంధువులు మూలుగ బొక్క కావాలని అడగడంతో,మూలుగ బొక్కలు లేవు అనడంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది.గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వైపు ల బంధువుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.చివరలో పెళ్లి రద్దు చేసు కోవడంతో బలగం సినిమా గుర్తుకు వచ్చింది. అత్త గారింట్లో అల్లుడికి మూలుగ బొక్క వేయకపోవడంతో బావ బామ్మర్థులకు మధ్య గొడవ జరిగింది.మామ చనిపోయేవరకు అల్లుడు తన అత్తగారింటికి రాలేదు. అయినా వీళ్ళ చాదస్తం కాకపోతే మూలుగ బొక్క కోసం పెళ్లిరద్దు చేసు కోవడం ఏంటి.