జ్ఞాన సమాజం కోసం పాటు పడే స్వేరో సైన్యం

—స్వేరో కోర్ రాష్ట్ర చీఫ్ బాబు నాయక్
సంగారెడ్డి : రాష్ట్రవ్యాప్తంగా సుశిక్తులైన వారియర్స్ స్వేరో కోర్ సైనికులను తయారు చేస్తామని రాష్ట్ర స్వేరో కోర్ చీఫ్ కమాండర్ బాబు నాయక్ గారు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో స్వేరో నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్వేరో కోర్ చీఫ్ బాబు నాయక్ హాజరై రాష్ట్రంలో స్వేరో సైన్యాన్ని తయారు చేయుటకు స్వేరో కోర్ నిర్మాణం కోసం 33 జిల్లాలు పర్యటించి సమసమాజం కోసం పాటుపడే స్వేరో వారియర్స్ ని తయారు చేసే క్రమంలో సంగారెడ్డి జిల్లాకు రావడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మెదక్ కో కన్వీనర్ లలిత రాణి, గౌరవ అధ్యక్షుడు నటరాజ్,జిల్లా అధ్యక్షులు బీబీపేట్ రాజు స్వేరో, జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ స్వేరో ఉపాధ్యక్షులు పల్లవి, కిరణ్, జిల్లా నాయకులు మల్లేష్ గౌడ్,రాము, సునంద,అనిత, శేఖర్ ,అసెంబ్లీ నాయకులు తుకారాం,సంగ్రాo, ప్రశాంత్ , మొగలప్ప, నర్సింలు, నగేష్ జనార్ధన్,ప్రకాష్, మొగులయ్య,మహేందర్ సంపత్, రాములు, స్వేరోస్ నాయకులు పాల్గొన్నారు.