దేశం మరియు ప్రపంచం ఒక గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయింది…

దేశం మరియు ప్రపంచం ఒక గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయింది….

  • డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక అజాత శత్రువు..
  • దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన గొప్ప ఆర్థిక వేత్త…
  • నేడు భారత దేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అంటే కారణం మన్మోహన్ సింగ్ గారే…..
  • మన్మోహన్ సింగ్ కి భారత రత్నా ఇవ్వాలి….
  • కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం….

ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక అజాత శత్రువు అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అన్నారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘనంగా నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ లాంటి మహనీయున్ని కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు మన్మోహన్ సింగ్ గురించి పొగుడుతున్న తీరును చుస్తే ఆయన ఎంతటి మహానువంబావుడో తెలుస్తుందని తెలిపారు. దేశంలో అన్ని పార్టీల నాయకులు రాజకీయాలకు అతీతంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారని అన్నారు. ఆర్బీఐ గవర్నర్ గా, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా దేశానికి మన్మోహన్ సింగ్ గారు అందించిన సేవలు ఎనలేనివని తెలిపారు. నేడు భారత దేశం ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప ఆర్థిక వేత్త అని కొనియాడారు. నీతి, నిజాయితీకి మారు పేరు మన్మోహన్ సింగ్ గారని వెల్లడించారు. సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. అలాంటి మహనీయునికి కేంద్ర ప్రభుత్వం వెంటనే భారత రత్నా అవార్డు ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. భారత రత్నా అవార్డుకే గౌరవం తీసుకువచ్చే గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారని తెలిపారు. మన్మోహన్ సింగ్ తో తెలంగాణకు ప్రత్యేక అనుబంధం ఉందని, అయన ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ సమాజం మన్మోహన్ సింగ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత దేశం ఒక గొప్ప మేధావిని, ఈ ప్రపంచం ఒక గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయిందని అన్నారు. సౌమ్యుడు, పరిణతి చెందిన మహునాభావుడు మన్మోహన్ సింగ్ గారికి బాధాతప్త హృదయంతో నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. అలాంటి మహనీయుని అడుగు జాడల్లో మనందరం పయనిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »