గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది.ఈ పథకం స్థానంలో అభయహస్తం పేరుతో రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.కొత్త పథకం నేపథ్యంలో గృహలక్ష్మిని రద్దు చేస్తున్నట్లు జీవో జారీ చేసింది. లబ్ధిదారులకు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను సైతం రద్దు చేశారు.ఇంటి స్థలం ఉన్న పేదలకు.. గృహ నిర్మాణం కోసం ₹3లక్షల ఆర్థిక సాయం చేసేందుకు గత ప్రభుత్వం గృహలక్ష్మి పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.