కనకమామిడిలో పంచాయతీ రోడ్డుకు టెండర్లు పూర్తి : భీమ్ భరత్ పర్యవేక్షణ

మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఇటీవల మంజూరైన పంచాయతీ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పర్యవేక్షణ చేపట్టి రోడ్డు పనులపై సమగ్రంగా పరిశీలించారు. గ్రామాభివృద్ధి పట్ల భీమ్ భరత్ చూపిస్తున్న ఆసక్తి పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

స్థానికులు అందరూ కలిసి భీమ్ భరత్‌ను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ముందుండి పని చేస్తున్నందుకు ఆయనకు ఘన స్వాగతం లభించింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, మొయినాబాద్ మండలం అధ్యక్షులు మానయ్య, చేవెళ్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పెంట రెడ్డి, కనకమామిడి గ్రామ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, ఆకుల పద్మ రావు, గూడూరు లక్ష్మీ శ్రీనివాస్, ఎం.ఎస్. రత్నం, వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, చిలుకూరు మాజీ సర్పంచ్ బద్రప్ప, చిలుకూరు రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలకృష్ణ రెడ్డి, జై రామ్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ రాఘవేంద్ర రెడ్డి, మహేశ్, హరేందర్ వంశీధర్ రెడ్డి, గుర్రాల భాస్కర్, మైసన్ రవి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »