ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి: పొన్నం.

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి: పొన్నం.
డిసెంబర్ 13: బుధ వారం రోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్ టి సి బస్సు ఎక్కిప్రయా ణించారు బస్సులో ఉన్న మహిళ ప్రయాణికులతో కొద్దిసేపు ముచ్చటించారు.ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచిత బస్సు ప్రయాణం ఎలాఉందని ప్రయా ణికులను అడిగి తెలు సుకున్నారు.అదేవిధంగా ప్రయాణికులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ప్రయాణం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మీరు చల్లగా ఉండాలి బిడ్డ అని కొంత మంది మహిళలు దీవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్టీసీని గాలికి వదిలేసిందని, ఆర్టీసీని బలోపేతం చేస్తామని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు స్వేచ్ఛగా తమ సమస్యలను విన్నవించు కోవచ్చని అంటూ ప్రతి పక్షాలు బాధ్యతగా వ్యవ హరించాలని కోరారు.
