ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ ను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు

ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ ను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు


జ్ఞానతెలంగాణ,డెస్క్ :

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని శ్రీలక్ష్మి హైకోర్టులో రివిజన్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. అక్రమ మైనింగ్ కేసులో కోర్టు ఇప్పటికే శ్రీలక్ష్మిని నిందితురాలిగా తేల్చడం, తాజాగా రివిజన్ పిటిషన్ కొట్టివేయడంతో ఆమె పాత్రపై సీబీఐ విచారణ కొనసాగనుంది.

You may also like...

Translate »