తెలంగాణ శివాజీ సర్దార్ పాపన్న గౌడ్

తెలంగాణ శివాజీ సర్దార్ పాపన్న గౌడ్

  • భూక్య సంతోష్ నాయక్
    లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య సంతోష్ నాయక్ గారు మాట్లాడుతూ,సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (1650 – 1710) తెలంగాణ చరిత్రలో ఒక ప్రజా వీరుడుగా నిలిచారు. ఆయనను “తెలంగాణా శివాజీ” అని కూడా పిలుస్తారు.పాపన్న గౌడ్ జననం వరంగల్ జిల్లాలోని ఖిలేశాపూర్ లో 1650లో గౌడ్ సమాజంలో జరిగింది,ఆయన చిన్ననాటి నుండే ధైర్యసాహసాలు, సమానత్వ భావన కలిగిన నాయకుడిగా పేరుపొందారు,ముగలుల పాలనకు వ్యతిరేక పోరాటం,అప్పట్లో తెలంగాణ ప్రాంతం ముగల్ సామ్రాజ్యం ఆధీనంలో ఉండేది,ముగల్ సుబేదార్లు, స్థానిక దుర్మార్గ జమీందార్లు ప్రజలపై భారం మోపుతూ, పీడన పాలన సాగించారు,పాపన్న గౌడ్ దీనికి ఎదురు నిలబడి ప్రజలకు న్యాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు,పాపన్న గౌడ్ సుమారు 20 సంవత్సరాల పాటు ముగల్ దళాలకు, స్థానిక పాలకులకు ఎదురొడ్డి నిలిచారు,ఆయన వరంగల్ సమీపంలో ఖిలేశాపూర్ కోటను బలపరచి అక్కడ తన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు.ఆయన పరిపాలనలో కులమత భేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయం లభించింది,ఆయన ప్రజలకు పన్ను భారాన్ని తగ్గించారు, రైతులకు రక్షణ కల్పించారు,గౌడ్, బంజారా, దళిత, గిరిజన, సబండ వర్గ ప్రజలకు అండగా నిలిచారు,రైతు వర్గాలకు అండగా నిలబడ్డారు,ఆయన పరిపాలనలో దోపిడీదారులు, ముస్లిం జమీందార్లు, ముగల్ సేనాధిపతులు ఎదురుదెబ్బ తిన్నారు,ఆయన శక్తివంతమైన తిరుగుబాటు ముగల్ సామ్రాజ్యానికి గట్టి సవాలుగా మారింది,చివరకు, ముగల్ సైన్యాధిపతులు 1710లో కుట్రపన్ని ఆయనను పట్టుకొని మరణదండన విధించారూ,పాపన్న గౌడ్ పేరు తెలంగాణలో స్వాతంత్ర్య, సామాజిక న్యాయ పోరాటానికి ప్రతీకగా నిలిచింది,తెలంగాణ సమాజంలో కులమత భేదాలు లేకుండా ప్రజాస్వామ్య ఆలోచనలు నాటిన ప్రజానాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు, మొత్తానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణలో ప్రజల కోసం పోరాడిన తొలి స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు అని కొనియాడారు

You may also like...

Translate »