ఇంక్కా ఎంత మంది ప్రాణాలు తీస్తారు….

భూక్య సంతోష్ నాయక్,
లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్


జ్ఞాన తెలంగాణ భువనగిరి ఆగస్టు 18:యాదాద్రి భువనగిరి జిల్లా తూర్కపల్లి మండలంలో లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య సంతోష్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని భువనగిరి నుండి సిద్దిపేటకు వెళ్లే నేషనల్ హైవే లో అనేక గుంతలమయంతో నిండిపోయి ఉంది,గతo లో అనేక మంది యువకులు, రైతులు పేదవాళ్లు విద్యార్థులు ఆ గుంతలో పడి కాళ్లు చేతులు, తలకాయలు పగిలి హాస్పటల్లో లక్షల రూపాయల్లో ఖర్చు చేయడం జరిగింది. ఈరోజుకి వారు ఇంకా కోల్పోవడం లేదు నిన్న రాత్రి 30 ఏళ్లకు చెందిన ఒక యువకుడు తన సొంత ఇంటికి వెళ్తుంటే ఆ గుంతలో అందులో పడిపోవడం జరిగింది ఇప్పుడు అతను ప్రాణాప స్థితిలో హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు గత నెలలో తుర్కపల్లికి చెందిన ఒక 20 ఏళ్ల యువకుడు సంగ్య తండ వద్ద గుంతలో పడిపోయి హాస్పటల్లో లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయి ఈ అధికార నిర్లక్ష్యం వల్ల అనేకమంది గతంలో చనిపోవడం జరిగింది, తక్షణమే R&B అధికారులను *DE మరియు ఆ రోడ్డు కాంట్రాక్టర్ను తక్షణమేp రద్దు చేసి అధికారులను సస్పెండ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, ఇప్పటికైనా స్పందించి రోడ్డులోన గుంతలను పూడ్చి పేదవాడు ప్రాణాలు కాపాడవలసిందిగా వేడుకుంటున్నాం, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »