డా” అంబేద్కర్ , భారత రాజ్యాంగ గ్రంధాన్ని జండా దగ్గర పెట్టాలి

డా” అంబేద్కర్ , భారత రాజ్యాంగ గ్రంధాన్ని జండా దగ్గర పెట్టాలి


రాకేష్ మహారాజ్ ,ధర్మ సమాజ్ పార్టీ

జ్ఞాన తెలంగాణ వలిగొండ, జనవరి 24:ధర్మ సమాజ్ పార్టీ లీడర్ ఎర్ర రాకేష్ మహారాజ్ మాట్లాడుతూ భారతదేశ సమస్తాన్ని అధిశాసన రూపంలో నడిపించే సుప్రీం పవర్ భారత రాజ్యాంగం అందరికీ తెలిసిన విషయమే. అందుకని భారత గణతంత్ర దినోత్సవం – భారత రాజ్యాంగ అమలు దినం ఐన రిపబ్లిక్ డే రోజు జనవరి 26 న జాతీయ జెండా వద్ద భారత రాజ్యాంగ గ్రంథాన్ని, దాని రూపశిల్పి డా. అంబేడ్కర్ చిత్రపటాన్నిఅక్కడ ఏర్పాటు చేయాలని, ప్రతిరోజూ విద్యా సంస్థలలో విద్యార్థులు చదివే ప్రార్ధనా స్థానంలో భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞగా చదివించేలాగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వేతర సంస్థలను కూడా ఆదేశించాలని డిమాండ్ లేఖను రాస్తున్నామన్నారు. త్వరగా అమలు నిర్ణయాన్ని GO ద్వారా తీసుకుంటారనీ ఆశిస్తున్నామన్నారు. పలు సందర్భాల్లో గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్ గారి చిత్రపటం భారత రాజ్యాంగ ప్రతిమను పెట్టకుండా అవమానిస్తున్నారని అలాగే గణతంత్రానికి స్వాతంత్రానికి తేడా తెలియకుండా చేస్తున్నానని వాళ్లు ఒక ప్రకటన తెలియజేయడం జరిగింది

You may also like...

Translate »