పేదలకు మెరుగైన వైద్యం అందించాలి : భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

- కట్టంగూర్ పీహెచ్ సీలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 23 : గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమారెడ్డి అన్నారు. కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తన నిధులు రూ.2లక్షల తో ఏర్పాటు చేసిన (ఆర్వో ప్లాంట్) నీటి శుద్ధి కేంద్రాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు శుద్ది జలాన్ని అందిచేందుకు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పేద ప్రజలకు కార్పోరేట్ స్థాయిలో వైద్యం అందించన్నుట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో సమస్యలుంటే తన దృష్టి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ వర్షాల కాలంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా వైద్య సిబ్బంది పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలు సిబ్బంది స్వచ్ఛమైన, సురక్షితమైన నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలన్నారు. నూతనంగా నిర్మించిన ఆసుపత్రికి పర్నిచర్ మంజూరు చేయాలని వైద్యాధికాలని శ్వేత తన సిబ్బందతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు కార్యక్రమంలో నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల, డిప్యూటీ డీఎంహెచ్ ఓ లోకసాని వేణుగోపాల్ రెడ్డి, వైద్యాధికారి శ్వేత, మండల ప్రత్యేక అధికారి సతీష్, తాసీల్దార్ యాదగిరి, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, డీటీ ఆల్బట్ ప్రాంక్లిన్, సీహెచ్ఓ నర్సింహ్మరావు, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది సుక్కయ్య, నాయకులు రెడ్డిపల్లి సాగర్, ముక్కామల శేఖర్, రెడ్డిపల్లి స్వామి, వల్లపు శ్రీనివాస్ రెడ్డి, అయితగోని నర్సింహ్మ , బుచ్చాల వెంకన్న, గుండు పరమేష్, మిట్టపల్లి శివ, మర్రి రాజు, కుంభం అనిల్ రెడ్డి, నంద్యాల వెంకటరెడ్డి, చౌగోని సాయిలు, గోశిక అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.