నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ పై అవగాహన..


జ్ఞాన తెలంగాణ,వలిగొండ జనవరి 17:

జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు వలిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలంధర్ రెడ్డి , మండల రెవెన్యూ అధికారి దశరథ్ నాయక్, మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ , మండల పంచాయతీ అధికారి సయ్యద అర్జుమాన్ బాను పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులకు 2026 జనవరి 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమంపై అవగాహన కల్పించారు, అందరూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తప్పకుండా హాజరు కావాలి అని సూచించారు. అలాగే గ్రామ స్థాయి మరియు మండల స్థాయిలో నిర్వహించనున్న సీఎం కప్ క్రీడా పోటీలపై చర్చించి, క్రీడల ద్వారా యువతను ప్రోత్సహించి సమగ్ర (ఆల్‌రౌండ్) అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు, గ్రామ కార్యదర్శులు పాల్గొని వివరాలు తెలుసుకున్నారు.

You may also like...

Translate »