ఉప్పరపల్లి పాఠశాలలో సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమం

సమాచార హక్కు చట్టం వార్షికోత్సవాల్లో భాగంగా ఉప్పరపల్లి పాఠశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు


  • సామాన్య ప్రజలకు సమాచార హక్కు చట్టం వజ్రాయుధం: ప్రధానోపాధ్యాయురాలు తేజావత్ జయ.
  • ప్రతి ఒక్కరు సహ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: సమాచార హక్కు రక్షణ చట్టం 2005 వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లేపు ప్రణీత్.

జ్ఞానతెలంగాణ,చిన్నారావు పేట :

వరంగల్ జిల్లా,చెన్నారావుపేట మండలం, ఉప్పరపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సహ చట్టం వార్షికోత్సవాలను సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.సమాచార హక్కు చట్టం 12 అక్టోబర్ నాటికి 20 సంవత్సరాలు పూర్తి అవ్వబోతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వార్షికోత్సవాలు ఈ నెల 5 నుంచి 12 వరకు నిర్వహించాలని నిర్ణయించి, ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో సహ చట్టం సొసైటీ వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లేపు ప్రణీత్ ఆధ్వర్యంలో పాఠశాలలో 9వ, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సహ చట్టంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తేజావత్ జయ మాట్లాడుతూ: సమాచార హక్కు చట్టం సామాన్య ప్రజలకు వజ్రాయుధమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి మరియు ప్రజలకు వారధిగా నిలిచి సమాచారాన్ని ప్రతి పౌరులకు అందించడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని, సహ చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అవ్వబోతున్న ఇంకా చాలావరకు చట్టంపై అవగాహన లేని సమయంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అలాగే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సొసైటీ సభ్యులను అభినందించారు.సమాచార హక్కు రక్షణ చట్టం 2005 వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లేపు ప్రణీత్ మాట్లాడుతూ: 12 అక్టోబర్ 2005లో అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారుతనం తీసుకువస్తుందని, సామాన్య ప్రజలను శక్తివంతం చేసి అవినీతిపరులను ప్రశ్నించగలిగేలా చేస్తుందని తెలిపారు.విద్యార్థులు కచ్చితంగా సహ చట్టంపై అవగాహన పొంది తమ కుటుంబ సభ్యులకు చట్టం ప్రాముఖ్యత తెలియజేయాలని కోరారు.
సమాచార హక్కు చట్టం-2005లోని అంశాలు, ఆర్టీఐ దరఖాస్తు విధానం, దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తు ఫీజు, ఇవ్వాల్సిన సమాచారం, పీఐవో, ఏపీఐవోల బాధ్యతలు, తదితర అంశాలపై వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత , శశిధర్, సంతోష్ కుమార్, పిన్నింటి బాలాజీ రావు, ఉదయ్ కుమార్, సిహెచ్ మాధవి, కె.మాధవి, బి.రమాదేవి, హంస రామకృష్ణ జూనియర్ అసిస్టెంట్ జాహేద్, క్రాఫ్ట్ టీచర్ చింతకింది ఇందిర, విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like...

Translate »