పి ఆర్ టి యు టి ఎస్ సిపిఎస్ మహా ధర్నా

పోస్టర్ ఆవిష్కరించిన పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు ఉడుత రాజేందర్
జ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి , ఆగస్టు 18:పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నల్లబెల్లి పి ఆర్ టి యు మండల శాఖ ఆధ్వర్యంలో నల్లబెల్లి ఉన్నత పాఠశాలలో పి ఆర్ టి యు టిఎస్ సిపిఎస్ మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు .కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లబెల్లి మండల విద్యాశాఖ అధికారిని అనురాధ ,స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు శఅంబి వసంత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి పిఆర్టియు టీఎస్ నల్లబెల్లి మండల అధ్యక్షుడు ఉడుత రాజేందర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో నిర్వహించే శాంతియుత మహాధర్నాను విజయవంతం చేయడానికి మండలంలోని ఉపాధ్యాయులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని సీపీఎస్ ను రద్దు చేసుకుని పాత పెన్షన్ విధానాన్ని సాధించుటకు ప్రతి ఉపాధ్యాయుడు హాజరుకావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బానోత్ కృష్ణ, రాష్ట్ర బాధ్యులు డి శ్రీధర్ బాబు, లడే రవీందర్, సిహెచ్ రాజేందర్ , రామస్వామి, సతీష్ జిల్లా బాధ్యులు కందకట్ల నాగరాజు,S శ్రీనివాస్ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఈ పెద్దన్న, వేణు కుమార్, రాజన్ బాబు, మంజుల అనిత, సిఆర్పిలు ఎస్ రాజేందర్,J రాంబాబు, D వెంకటయ్య ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
