ఫిబ్రవరి 03 న చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి

ఫిబ్రవరి 03 న చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి
- మాదిగ కళాకారులతో సమావేశం
- లక్ష డప్పులు, వెయ్యి గొంతుల *నర్సంపేట నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక.
జ్ఞాన తెలంగాణ నర్సంపేట డిసెంబర్ : వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బరిగెల బాబు, జూపాక శివ ఆదేశాల మేరకు, ఈరోజు వరంగల్ జిల్లా అధికార ప్రతినిధులు బొమ్మెర రవి, మెట్ పల్లి కొమురయ్య వరంగల్ జిల్లా అధ్యక్షులు తాళ్ల సునీల్ ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా msp పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు దళిత రత్న కల్లెపెల్లి ప్రణయ్ దీప్ మాదిగ గారు, రాష్ట్ర నాయకులు తడుగుల విజయ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కట్ల రాజశేఖర్ మాదిగ లు పాల్గొని మాట్లాడుతూ.. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఫిబ్రవరి మూడో తారీఖున జరిగేటువంటి లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి మాదిగ బిడ్డ డప్పు సంకనేసుకుని హైదరాబాద్ కు తరలి రావాలని పిలుపు ఇవ్వడం జరిగింది. 30 ఏళ్లుగా మాదిగ జాతిని ఐక్యం చేసి అనేక పోరాటాలు చేసిన మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ కళాకారులంతా కూడా అంతిమ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 30 ఏళ్లుగా మాదిగ మాదిగ ఉపకులాల ఫలాలు అనుభవిస్తున్న మాల సోదరులు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఏబిసిడి వర్గీకరణ జరగకుండా అనేక కుట్రలు చేస్తున్నారని ఆ కుట్రలను తిప్పి కొట్టడం కోసం ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా వచ్చేంత వరకు మాదిగ జాతి మొత్తం ఐక్యంగా ఏర్పడి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.నర్సంపేట నియోజకవర్గం నూతన అధ్యక్షులుగా : అబ్బదాసి యాకయ్య
ప్రధాన కార్యదర్శిగా: బరిగెల రవీందర్
కోఆర్డినేటర్ గా : మాంకాల సాంబరాజు
నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జిగా :గోవిందు రాజేందర్
అధికార ప్రతినిధిగా: గాదెపాక బాబు
ముఖ్య సలహాదారులుగా : కన్నం వెంకన్న, కల్లెపెల్లి ప్రణదీప్ మాదిగ, కట్ల రాజశేఖర్
ఉపాధ్యక్షులుగా : మేకల రాజు, నల్లబెల్లి మేఘం మాదాసి బాబు, దారా శంకర్, బిక్షపతి, ఇనుగాల రఘువరన్
సహాయ కార్యదర్శిలుగా : శ్రీశైలం మునిగే యాకూబ్, పరికి లక్ష్మణ్, పులిగిల్ల నరేష్, చిన్న పెల్లి లక్ష్మణ్,దిలీప్, ల్యాదల్ల హరీష్
తూళ్ల యాకయ్య
కమిటీ సభ్యులుగా:
అలు వాల మహేందర్, మాదాసి కుమార్, విజయ్, జీడి ప్రకాష్, సారంగం నవీన్ గ్యార సందీప్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.