నల్లబెల్లిలో కల్తీ మొక్కజొన్న విత్తనాల “మాయా”జాలం
నష్టపోతున్న అమాయకపు రైతులు

నల్లబెల్లిలో కల్తీ మొక్కజొన్న విత్తనాల “మాయా”జాలం
నష్టపోతున్న అమాయకపు రైతులు



జ్ఞాన తెలంగాణ ,వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి:వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో కల్తీ విత్తనాల ప్రభావం ఫలితం కనిపిస్తుంది .వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు లేదా వ్యవసాయదారుడు అని అంటారు. తెలంగాణలో నకిలీ (దోషపూరిత / స్పూరియస్) విత్తనాలు అమ్మితే కఠినమైన శిక్షలు ఉన్నాయి.ప్రస్తుత చట్టాల ప్రకారం Seed Act,1966,Essential Commodities Act, 1955 కింద కేసులు నమోదు చేస్తారు. అయితే తాజాగా నల్లబెల్లి మండలంలోని రామతీర్థం గ్రామంలో ఒక రైతు మొక్కజొన్నలు వేసినాడు పంట పీచు(కంకి) వేసే సమయానికి బెల్టు , వైరస్ రావడంతో మొక్క కుళ్ళిపోవడం మొదలైంది. తను విత్తనాలు తీసుకొచ్చిన షాప్ దగ్గరికి వెళ్లి ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో ఆరుకాలం కష్టపడి పండించిన పంట ఆగమై పోయిందని, గొడవ చేసినా సంఘటన తాజాగా నల్లబెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వ్యవసాయ అధికారులు తనిఖీలు చేసినప్పటికీ, కల్తీ విత్తనాలు సరఫరా ఆగడం లేదు.
ఇంత జరిగినా కూడా నకిలీ విత్తనాలు అమ్మిన షాపు పై వ్యవసాయ అధికారు లు చర్యలు తీసుకోకపోవడం వేనుక కారణాలు ఏంటి. అని రైతులు మరియు మండల ప్రజలు ఎదురు చుస్తునారు…

నకిలీ విత్తనాల అమ్మకాలకు సహకరిస్తుంది ఎవరు?
నకిలీ విత్తనాల పంచాయితీ పెద్దమనుషుల పెత్తనం? నకిలీ విత్తనాలతో మోసపోయిన బాధిత రైతుల పూర్తి వివరాలు….. మారో సంచికలో

You may also like...

Translate »