వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో యూరియా బస్తాల కోసం అన్నదాతల పడిగాపులు

- వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో యూరియా బస్తాల కోసం అన్నదాతల పడిగాపులు పట్టించుకోని ప్రభుత్వం, అధికార యంత్రాంగం
జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,ఆగస్టు 20: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లోని ఖానాపూర్ మండలంలో బుధరావుపేట గ్రామంలో 365 నంబర్ జాతీయ రహదారిపై యూరియా బస్తాల కోసం రైతులు భారీ ఎత్తున ధర్నా చేశారు. ఈ ధర్నాలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని రైతులతోపాటు రోడ్డుపై బైఠాయించారు. సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు యూరియా బస్తాల కోసం ఉదయం 3 గంటల నుంచి లైన్లో నిలబడితే రైతులకు ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వకపోవడం బాధాకరం అని, రైతులు సాగు మానేసి యూరియా బస్తాల కోసం తిరుగుతున్నారని ,నియోజకవర్గంలోని రైతులు రైతు వేదికల వద్ద,పాక్స్ గోదాముల వద్ద పడి కాపులు కాస్తున్నా కూడా స్థానిక ఎమ్మెల్యే గాని వ్యవసాయ శాఖ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని సమీక్ష సమావేశాలను నిర్వయించకపోవడం బాధాకరమని,రైతులను నిర్లక్ష్యం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు.

