రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలి

బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధానకార్యదర్శి. చింతకింది కుమారస్వామి


ఙ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గం ప్రతినిధి:11 అక్టోబర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు చట్టాన్ని ఆమోదించకుండా మోడీ ప్రభుత్వం వ్యహరించడం వల్లనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో అనేక ఆటంకాలు కలుగుతున్నాయనీ కుమారస్వామి అన్నారు. మండల కేంద్రము అయిన నల్లబెల్లి అంబేద్కర్ సెంటర్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టాన్ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి ఆమోదించవలసిన బీసీ ప్రధాన మంత్రిని అంటున్న మోడీ బీసీల ఎడల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగానే తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయ న్నారు. బీసీల రిజర్వేషన్లు అమలు జరగాలంటే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ఒక్కటే మార్గమని ఎందరో న్యాయకోవిదులు నిపుణులు చెప్పుతున్నా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్డినెన్స్ అని ఒకసారి జీవో అని ఒకసారి కాలయాపన చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల జీవో మీదా అగ్రకులాలు న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశాలు కల్పించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లు సాధించడానికి అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను కలుపుకొని ఐక్య కార్యాచరణ ద్వారా బలమైన ఉద్యమాన్ని నిర్మించి మోడీ ప్రభుత్వం బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా కృషి చేయాలన్నారు. ఈ మోకా తప్పితే బీసీలు ఆగమై పోతారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీల వెనుకాల ఉన్న బీసీలంతా రాజకీయాలకు అతీతంగా ఎక్కడికక్కడ జేఏసీలుగా ఏర్పడి బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని అన్నారు అందుకు కావలసిన చొరవను బీసీ హక్కుల సాధన సమితి చూపుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వైనాల వీరస్వామి, బీసీ హక్కుల సాధన సమితి మండల కన్వీనర్ కడియాల క్రాంతి కుమార్ మండల నాయకులు కోల లింగయ్య మామిళ్ల పెద్ద ఐలయ్య జి రమేష్ బోడిగే నారాయణస్వామి కే శ్రీను తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »