జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల – మోజర్లలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం

జ్ఞాన తెలంగాణ,పెద్దమందడి మండల ప్రతినిధి :


పెద్దమందడి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల – మోజర్ల నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్.వరప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రయోగాల ద్వారా పాఠశాల బృందానికి అబ్బుర పరిచాయి.నదులలో గల నీటికి సాంద్రత తక్కువగా వుంటుందని విద్యార్థులు ప్రయోగం ద్వారా నిరూపించడం జరిగింది.గాలి యొక్క ధర్మాలను తెలిపే శాంటోరీయో ధర్మా మీటర్లు మరియు వైద్య పరిమాణికరణ గురుంచి ప్రయోగ రూపకంగా తెలిజేయడం జరిగింది.నీటిలో నివసించే జలచరాలు గురించి తెలిపే ప్రయోగం చాలా అద్భుతంగా ఉందని వారన్నారు.మానవ నిర్మాణ భాగాలు,వాటి పని తీరు విద్యార్థులు వివరించడం జరిగింది.శృతి దండాల ప్రయోగం బ్యురేట్,పిప్పెట్టు ప్రయోగం , మైక్రోస్కోప్ వినియోగం, కలయిడో స్కోప్ వినియోగం,కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుందని తెలిపే కాంతి పరావర్తనం మరియు వక్రీభవనం గురించి తెలిపే ప్రయోగ నిరూపణ ద్వారా విద్యార్థులు చాలా క్లుప్తంగా వివరణాత్మకంగా వివరించడం జరిగిందని ఎస్.వరప్రసాద్ రావు తెలిపారు.అనంతరం సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.వరప్రసాద్ రావు, ఉపాధ్యాయ బృందం డి. రణధీవ్, పి.వెంకట్ స్వామి, గద్వాల కృష్ణ,భగవంతు, వాణి ప్రభ,పుల్లయ్య,మధుసూదన్, ఎన్.వెంకట స్వామి,ఏ.వెంకట్ స్వామి, చిన్నా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »