ఈ నెల 4న వనపర్తి కి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

గోపాల్ పేట్, రేవల్లి మండలాలకు పల్లు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి రానున్న భట్టి విక్రమార్క

గోపాల్ పేట్ మండల కేంద్రములోని పద్మావతి గార్డెన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం


ఙ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి :

జనవరి 4వ తేదీన వనపర్తి నియోజకవర్గంలోని పల్లు అభివృద్ధి పనుల ప్రారంభంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు పాల్గొన్నట్లు వనపర్తి స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు వారు నిన్న ఓ ప్రకటనలో అన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు మాట్లాడుతూ జనవరి 4వ తేదిన శనివారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు రేవల్లి మండల పరిధిలోని తల్పనూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11KV విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంబించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు గోపాల్ పేట్ మండల పరిధిలోని ఏదుట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11KV విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.కార్యక్రమం అనంతరం గోపాల్ పేట్ మండల కేంద్రంలోనీ పద్మావతి గార్డెన్ లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు,రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి గారు, పార్ల మెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు,రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మెన్ శివసేన రెడ్డి గారు పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట్, రేవల్లి మండలాల ముఖ్య కార్యకర్తలు,నాయకులు మరియు ప్రతి ఒక్క హోదా గల నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.

You may also like...

Translate »