టైక్వాండో లో సత్తాచాటిన సంజీవ్ కుమార్ ను అభినందించిన తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

జ్ఞాన తెలంగాణ,వికారాబాద్,జనవరి 04 :
ఈరోజు వికారాబాద్ పట్టణ కేంద్రంలోని వియత్నం 2024 ఆసియా ఓపెన్ పోలీస్ టైఖండో ఛాంపియన్షిప్లో మన భారతదేశం తరఫున పాల్గొని మూడో స్థానంలో నిలిచిన వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, సోమన్ గుర్తి గ్రామానికి చెందిన దుద్యాల చెన్నయ్య, మంజుల కుమారుడు రాచకొండ కమిషనరేట్ లో కానిస్టేబుల్ దుద్యాల సంజీవ్ కుమార్ ని అభినందించిన గౌరవ తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ గారు. అనంతరం తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ గారు మాట్లాడుతూ మన దేశం తరఫున టైక్వాండో పోటీలో మూడో స్థానం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ముందు ముందు ఇంకా ఎన్నో విజయాలను సాధించాలని అన్నారు. క్రీడాకారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. అదేవిధంగా గెలుపొందిన దుద్యాల సంజీవ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే భవిష్యత్తులో కూడా దేశ విదేశాలు నిర్వహించే టైక్వాండో పోటీలో గెలిచి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తానని హర్షం వ్యక్తం చేశారు.