వికారాబాద్‌లో మూఢనమ్మకంతో స్నేహితుడి హత్య

వికారాబాద్‌లో మూఢనమ్మకంతో స్నేహితుడి హత్య


జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి,ఫిబ్రవరి 24 :

వికారాబాద్ జిల్లాలో మూఢనమ్మకాల ముసుగులో దారుణ హత్య చోటుచేసుకుంది. తాండూరు మండలం కరణ్‌కోట్ గ్రామంలో ఆటో డ్రైవర్ సాయిలు (45)ను అతని స్నేహితుడైన బాలప్ప నడిరోడ్డుపై కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. ఆర్థిక నష్టాలకు సాయిలే కారణమని, చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో బాలప్ప కొంతకాలంగా కక్ష పెంచుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పట్టపగలే ప్రజల ముందే దాడి చేసి రక్తంతో తడిసిన కత్తితో నిలబడటం గ్రామంలో భయాందోళనకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆధునిక యుగంలోనూ మూఢనమ్మకాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో మళ్లీ నిరూపించింది. వ్యక్తిగత విభేదాలు, అజ్ఞానం కలిసినప్పుడు హింసాత్మక పరిణామాలకు దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

You may also like...

Translate »